ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, అన్నీ మారతాయి, మీరు కూడా మారాలి. మీ ఇంటిని పోషించాల్సింది మీరే అయినా, లేదా మీరు ఒక మామూలు ఉద్యోగి అయినా ఈ బుక్ ను తప్పకుండా చదవాలి. మార్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్రజలు నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు, మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. హూ మూవ్డ్ మై చీజ్ అనేది ఒక ప్రత్యేకమైన కథ. ఇందులో మీరు జీవితంలో విలువైన పాఠాలు నేర్చుకుంటారు.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
సాధారణ ఉద్యోగులు
ప్రొఫెషనల్స్
కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళు
అన్ని రకాల వృత్తుల వాళ్ళు
రచయత గురించి:-
స్పెన్సర్ జాన్సన్ ఒక మెడికల్ డాక్టర్ ఇంకా బెస్ట్ సెల్లింగ్ రచయిత కూడా. ఆయన 10 పాపులర్ బుక్స్ రాశారు. వాటిలో హూ మూవ్డ్ మై చీజ్, వన్ మినిట్ మేనేజర్ లు కూడా ఉన్నాయి. ఆయన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల పైగా కాపీలు అమ్ముడుపోయాయి. ఆయన రచనలు 47 భాషల్లో ప్రింటయ్యాయి..