మీరు మీ కోరికలకు ఎల్లప్పుడూ లొంగిపోతారా? మీ పనులు పూర్తి చేయడంలో బద్ధకంగా వున్నారా? అలా అయితే ఈ బుక్ మీ కోసమే. మీకు మరింత విల్ పవర్ అవసరం ఉంది. ఈ బుక్ లో విల్ పవర్ ఎలా పని చేస్తుందో, అది మీ బాడీ మరియు మైండ్ ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటారు. విల్ పవర్ ముఖ్యమైనది. ప్రపంచంలో అత్యంత విజయం సాధించిన వాళ్లంతా చాలా బలమైన విల్ పవర్ కలిగి వున్నారు. దాన్ని మీరు కూడా పొందే టైమ్ ఇది.
ఈ సారాంశం ఎవరు చదవాలి?
కాఫీ వ్యసనపరులు, ఆల్కహాలిక్కులు, చెయిన్ స్మోకర్లు
ఫాస్ట్ ఫుడ్ అభిమానులు, మంచానికి అతుక్కుపోయిన వాళ్ళు మరియు సోషల్ మీడియా ట్రోల్స్
చెడు అలవాట్లు మానాలనుకున్న వారెవరైనా
ఎక్కువ సెల్ఫ్ కంట్రోల్ కోరుకునే వారు
రచయిత్రి గురించి:-
డాక్టర్ కెల్లీ మెక్ గొనిగల్ ఒక రచయిత్రి, లెక్చరర్ ఇంకా సైకాలజిస్ట్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఇప్పుడు అక్కడే లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈ బుక్ కి ఆధారమైన విల్ పవర్ గురించి ఒక పాపులర్ కోర్సు ను ఆమె టీచ్ చేస్తారు. డాక్టర్ కెల్లీ యొక్క “ స్ట్రెస్ యాజ్ యువర్ ఫ్రెండ్” అనే పేరు గల TED టాక్ 20 మిలియన్ వ్యూస్ సాధించింది. తన లెక్చర్లు, బుక్స్ ద్వారా ఆమె ప్రజలకు సహాయపడుతున్నారు.