Why Should You Read This Summary?
ఈ సారాంశాన్ని మీరెందుకు చదవాలి ?
మీకు చాలా పనులున్నాయి, అందులో ఏది ముందు చేయాలో అర్ధంకావట్లేదా? మీరు పూర్తి చేయాల్సిన ఈ పనుల గురించి టెన్షన్ పడుతున్నారా? అయితే, ఈ పుస్తకం మీకు సాయం చేస్తుంది. వెంటనే ఇప్పుడు మీరు పూర్తిచేయాల్సిన ముఖ్యమైన పనే - ఆ ఒక్క పని. మీరు మీ గోల్స్ ని సాధించే వరకూ రోజులో, వారం రోజుల్లో, నెలలో, అలాగే సంవత్సరంలో చేయాల్సిన మీ “ఒక్క పని” ని మీరు నిర్ణయించుకోవాలి. చేయాల్సిన పని యొక్క విలువ, ఇంకా ఆ పని దేనికోసం చేస్తున్నామన్న కారణం తెలిస్తే, మీరు మరింత ప్రొడక్టివ్ గా ఉంటారు ఇంకా మంచి రిజల్ట్స్ ని సాధిస్తారు. ఈ పుస్తకం మీరు చేయాల్సిన “ఆ ఒక్క పని” ని తెల్సుకోవడానికి సాయం చేస్తుంది. మీ సక్సెస్ కు దారిని చూపిస్తుంది.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి ?
- ఉద్యోగస్తులు ఇంకా మేనేజర్లు
- ఆంట్రప్రెన్యుర్లు
- తల్లి వయసులో ఉన్న పెద్దవారు
రచయిత గురించి:-
గ్యారీ కెల్లర్ ఒక ఆంట్రప్రెన్యుర్, బిజినెస్ కోచ్, ఇంకా బెస్ట్ సెల్లింగ్ రచయిత. ఆయన కెల్లర్ విలియమ్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థని స్థాపించారు. ఆయన కెల్లర్ విలియమ్స్ సంస్థలన్నీటికీ హెడ్ అయిన కె.డబల్యు.ఎక్స్ (KWx) సంస్థకి ఎక్జిక్యుటివ్ ఛైర్మన్ గా ఉన్నారు. గ్యారీ కెల్లర్ ‘ది మిలియనీర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్’ ఇంకా ‘ది మిలియనీర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్’ అనే పుస్తకాలకు రచయిత కూడా.