Why Should You Read This Summary?
ఈ సారాంశాన్ని ఎందుకు చదవాలి?
ఈ సారాంశాన్ని ఎందుకు చదవాలో, కొన్ని కారణాలు:-
పిల్లలతో గాఢమైన అనుబందాన్ని కోరుకునే తల్లిదండ్రులకు ఈ బుక్ ఒక మార్గదర్శి లాంటిది. పిల్లల మానసిక సంఘర్షణలను తగ్గించడం కోసం ప్రేమ పూర్వకమైన మార్గాల్లో వారిని దగ్గర తీసుకుని ఎలా వారిని డీల్ చేయాలో ఈ బుక్ నేర్పిస్తుంది.
పేరెంట్స్ లో మైండ్‌ఫుల్ పేరెంటింగ్ ఎంత అవసరమో చెప్పడం ద్వారా ఈ బుక్, పేరెంట్స్ కి చాలా అవసరం. పేరెంట్స్ లో పిల్లలతో గడిపే క్షణాలు వారి జీవితం లో ఎంత ముఖ్యమో, ఎంత ప్రభావవంతమో ఈ బుక్ మీకు అవగాహన కలిగిస్తుంది.
తల్లిదండ్రుల మానసిక స్థితి, వారి పిల్లలతో వారి సంబంధాన్ని బాగా ప్రభావితం చేస్తుందని గుర్తించమని నేర్పిస్తుంది. పిల్లల వ్యక్తిగత ఎదుగుదల, ఇంకా తమను తాము తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలని మీరు నేర్చుకుంటారు.
ఈ బుక్, తల్లిదండ్రులు మరియు పిల్లలలోని ఎమోషనల్ ఇంటిలిజెన్స్ డెవలప్ చేస్తుంది, ఫ్యామిలీ లోని ఎమోషన్స్ గురించి మెరుగైన కమ్యూనికేషన్ గురించి అవగాహనను పెంచుతుంది.
తల్లిదండ్రుల సాంప్రదాయ, నిరంకుశ భావాల, ఆలోచనల కోణం నుండి, స్పృహతో కూడిన, సహకారం తో కూడిన ఆలోచనల విధానం వైపుకు మారమని, వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అది కుటుంబాల్లో సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టించుకోవడం లో సహాయపడుతుంది.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
-
తల్లిదండ్రులు
-
కేర్ టేకర్లు
-
పిల్లలతో గాఢమైన అనుబంధం ఏర్పరచుకునే వారు
-
పర్ఫెక్ట్ పేరెంటింగ్ గురించి తెలుసుకోవాలనుకునే వారు
-
పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను పెంచాలి అనుకునే వారు
రచయిత్రి గురించి:-
డాక్టర్. షెఫాలీ త్సబరీ ఒక క్లినికల్ సైకాలజిస్ట్, రచయిత్రి, ఇంకా వక్త. కాన్షియస్ పేరెంటింగ్, ఇంకా పర్సనల్ డెవలప్మెంట్ రంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపు పొందారు. కొలంబియా యూనివర్సిటీ నుండి క్లినికల్ సైకాలజీలో డాక్టరేట్ పొందారు. డాక్టర్ షెఫాలీ తన పుస్తకం “ది కాన్షియస్ పేరెంట్” తో చాలా పెద్ద గుర్తింపు పొందారు. ఆవిడ, సైకాలజీ, పేరెంటింగ్ రంగాల్లో ఉన్నారు.