Why Should You Read This Summary?
ఈ సారాంశాన్ని మీరెందుకు చదవాలి?
మీ సంస్థ కోసం మీ మైండ్ లో ఒక అద్భుతమైన ఐడియా ఉంది, కానీ దాని గురించి మాట్లాడడానికి మీకు ధైర్యం సరిపోవట్లేదా? చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ మీరు వాయిదా వేస్తున్నారు అనిపిస్తుందా? ప్రతి చిన్న విషయానికీ మీరు ఎక్కువగా వర్రీ అవుతూ యాంక్సియస్ గా ఫీల్ అవుతుంటారా? మీ భయాలన్నిటినీ జయించి మీ బలమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ప్యాషన్ ని సాధించి, మీ ఆరోగ్యాన్ని ఇంకా మీ అనుబంధాలను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ జీవితాన్ని 5 సెకండ్లలో మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, సమాధానాల కోసం ఇంకా ఒక సంతోషకరమైన, అలాగే సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మీరు ఈ సారాంశాన్ని చదవాలి.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
- సైకాలజిస్టులు
- టీచర్లు
- విద్యార్థులు
- తల్లిదండ్రులు
- గ్రాండ్ పేరెంట్స్
- మంచిగా జీవించాలి అనుకునే ఎవ్వరైనా
రచయిత గురించి:-
మెలనీ రాబిన్స్ ఒక అమెరికన్ పాడ్కాస్ట్ హోస్ట్, రచయిత, మొటివేషనల్ స్పీకర్, ఇంకా గతంలో లాయర్ గా కూడా పని చేశారు. ఆమె తన టెడ్ టాక్, తన పుస్తకాలైన 5 సెకండ్ రూల్ ఇంకా హై 5 హాబిట్, అలానే మెల్ రాబిన్స్ పాడ్కాస్ట్ హోస్ట్ గా ప్రసిద్ధి చెందారు. రాబిన్స్ క్రిమినల్ డిఫెన్స్ అటార్నీ గా కూడా పనిచేశారు. 2014 లో నాన్-ఫిక్షన్ లో బెస్ట్ హోస్ట్ గా ఆమె “గ్రేసీ అవార్డు” ను అందుకున్నారు.