Why Should You Read This Summary?
మీరు ఈ సారాంశాన్ని ఎందుకు చదవాలి?
స్టీవ్ జాబ్స్ 2010 లో ఐప్యాడ్ ను లాంచ్ చేశాడు. అది అందరి చేతుల్లోనూ వుండాలి అని కోరుకున్నారు. ఐప్యాడ్ అద్భుతమైనది. అది మన అనుభవాలను ఒక పూర్తి కొత్త లెవెల్ కి తీసుకువెళ్తుంది. కానీ స్టీవ్ జాబ్స్ తన పిల్లల్ని ఎప్పటికీ దానిని ముట్టుకోనివ్వలేదు.
జర్నలిస్టులు, బయోగ్రఫర్లు స్టీవ్ జాబ్స్ ఇంట్లో ఐప్యాడ్ కి ఎంట్రీ లేదు అని ప్రూవ్ చేశారు. మొబైల్ డివైజ్లు అడిక్టివ్ అన్న సంగతి అందరికన్నా స్టీవ్ జాబ్స్ కి ఎక్కువ తెలుసు. ఆయన ఎప్పటికీ తన పిల్లల్ని తను తయారు చేసిన ప్రొడక్ట్స్ దగ్గరకు కూడా వెళ్లనీయలేదు.
ఫోన్లు ఎందుకు అంత అడిక్టివ్ గా మారతాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు అందరి మీదా ప్రభావం చూపించే ఈ ఫోన్ అడిక్షన్ నుండి మీరు మిమ్నల్ని, మీ పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పుస్తకం చదవండి.
ఈ పుస్తక సారాంశాన్ని ఎవరు చదవాలి?
- పేరెంట్స్
- టీనేజర్లు
- కాలేజ్ స్టూడెంట్స్
- మిలేనియల్స్
రచయిత గురించి:-
ఆడమ్ ఆల్టర్ ఒక బెస్ట్ సెల్లింగ్ రచయిత, ప్రొఫెసర్, ఇంకా కాలమిస్టు. ఆయన ఎన్ వై యు (న్యూయార్క్ యూనివర్సిటీ)లో ఒక మార్కెటింగ్ ప్రొఫెసర్. ఆయన డ్రంక్ ట్యాంక్ పింక్ అనే పుస్తక రచయిత కూడా, మరియు ఎస్కేప్ వెలాసిటీ అనే పేరుతో రాబోయే ఇంకో పుస్తకానికి కూడా రచయిత. ఆడమ్ ద వాషింగటన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇంకా ఇతర ప్రముఖ పత్రికలకు ఆర్టికల్స్ రాశారు.