Why Should You Read This Summary?
ఈ సారాంశాన్ని మీరెందుకు చదవాలి?
ఆహారం విషయంలో మీరు ఎలాంటి వారో మీకు తెలుసా? మీ ఈటింగ్ పర్సనాలిటీ ఏంటో మీకు తెలుసా? ఎలాంటి డైట్ ప్లాన్స్ ని పాటించకుండా మీరు ఆరోగ్యంగా ఇంకా ఫిట్ గా ఉండగలరని మీకు తెలుసా? ఎప్పుడు తినాలి ఎప్పుడు ఆపాలి అని మీ శరీరం మీకు సిగ్నల్స్ పంపిస్తుందని మీకు తెలుసా? మీకు నచ్చినవి తింటూ మీ శరీరాన్ని ప్రేమిస్తూ, చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఇంకా ఫిట్ గా ఎలా ఉండాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఎలాంటి భయాలు లేకుండా మీకు నచ్చిన ఆహారాన్ని ఎలా తినాలో మీరు తెలుసుకుంటారు. మీరు తినే విధానాన్ని మార్చుకునేలా మీకు కావాల్సిన అన్ని సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
● తల్లిదండ్రులు
● టీచర్స్
● డాక్టర్లు
● విద్యార్థులు
● పోషకనిపుణులు
● థెరపిస్టులు
● తమ బరువును కంట్రోల్ చేసుకోవాలనుకునే ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని చదవచ్చు.
రచయితల గురించి:-
ఎవెలిన్ ట్రిబోలె
ఎవెలిన్ ట్రిబోలే ఒక పౌషకాహార నిపుణులు, ఇంకా బెస్ట్ సెల్లర్ అయిన ఇంట్యూటివ్ ఈటింగ్ తో పాటు 10 పుస్తకాలకు పైగా రచించారు. ఆవిడ ఆరోగ్య నిపుణులకు ఇంట్యూటివ్ ఈటింగ్ విధానం ద్వారా ఆహారం, మైండ్ ఇంకా శరీరంతో మంచి అనుబంధం ఏర్పర్చుకోవడం ఎలానో తమ క్లయింట్లకు సహాయం చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పటివరకు 37 దేశాలలో 1500 కు పైగా సర్టిఫైడ్ ఇంట్యూటివ్ ఈటింగ్ కౌన్సిలర్లు ఉన్నారు. 1984 లో ఆమె మొట్టమొదటి మహిళా ట్రయిల్స్ మారథాన్ కు క్వాలిఫై అయ్యారు.
ఎలైజ్ రేష్
ఎలైజ్ రెష్ కాలిఫోర్నియా లోని బెవర్లీ హిల్స్ లో సొంతగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక పౌషకాహార నిపుణులు. ముఖ్యంగా ఈటింగ్ డిజార్డర్స్, ఇంట్యూటివ్ ఈటింగ్, ఇంకా ప్రతి సైజ్ కీ ఆరోగ్యం లాంటి విషయాల్లో ఆమెకు ముప్పై తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. ఇంట్యూటివ్ ఈటింగ్ తో పాటు ఆమె మరికొన్ని పుస్తకాలకు సహరచయితగా ఉన్నారు.
ఆరోగ్యంగా తినడం అనే విషయం మీద ఆమె జర్నల్ ఆర్టికల్స్, ప్రింట్ ఆర్టికల్స్ ఇంకా బ్లాగ్ పోస్టులను పబ్లిష్ చేశారు. ఎలైజ్ రెగ్యులర్ గా వీటి గురించి ఈవెంట్స్ లో, పాడ్ కాస్ట్స్ లో మాట్లాడుతూ ఉంటారు, ఇంకా మీడియా లో ప్రత్యేక ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్యూటివ్ ఈటింగ్ విధానం ద్వారా తన పేషెంట్లను డైట్ కల్చర్ నుంచి కాపాడి ఎలైజ్ దేశమంతా పేరు సంపాదించారు.