ఏదోక రోజు మీరు ఒక పేరెంట్ అవ్వాలనుకుంటున్నారు లేదా మీ పిల్లలను సరైన మార్గంలో పెంచాలనుకుంటున్నారు. ఖచ్చితంగా అందుకే మీరు ఇది చదువుతున్నారు. ఏ పిల్లలూ మంచి వాళ్ళు లేదా చెడ్డ వాళ్ళుగా పుట్టరని ముందు మీరు అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళని ఎలా పెంచుతామో దానిబట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళవుతారనేది నిర్ణయించబడుతుంది. సంతోషకరమైన, తెలివైన, ఇంకా మంచి ప్రవర్తన తో ఉండేలా పిల్లలను పెంచడానికి గుర్తుంచుకోవాల్సిన రూల్స్ ను మీరు ఈ పుస్తకంలో నేర్చుకుంటారు.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
గర్భవతులు
భార్యాభర్తలు
తల్లిదండ్రులు
సింగిల్ పేరెంట్స్
రచయిత గురించి:-
డా. జాన్ మెడీనా ఒక మాలిక్యులార్ బయాలజిస్ట్, ప్రొఫెసర్ ఇంకా ఒక రచయిత. చిన్నపిల్లల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద రిసెర్చ్ చేసే తలారీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఆయన స్థాపించి డైరెక్టర్ గా ఉన్నారు. ఒక విద్యావేత్తగా మెడీనా ఎన్నో అవార్డులను అందుకున్నారు. సియాటిల్ పసిఫిక్ విశ్వవిద్యాలయంలోని బ్రెయిన్ సెంటర్ కు కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. సైకాలజీ మీద ఆయన పదికి పైగా పుస్తకాలను రాశారు.