Why Should You Read This Summary?
ఈ సారాంశాన్ని మీరు ఎందుకు చదవాలి?
మనందరికీ మంచి అలవాట్లు కావాలి అని ఇంకా చెడు అలవాట్లను వదిలివేయాలి అనుకుంటాం. మీరు మార్చడానికి ఇంతకు ముందు చాలాసార్లు ట్రై చేసుండొచ్చు, కానీ మీరు ఫెయిల్ అయ్యారు. అందుకోసం ఈ అంతర్జాతీయ బెస్ట్ సెల్లింగ్ పుస్తకం మీకు సింపుల్, ఇంకా ప్రభావవంతమైన మార్గాలను నేర్పుతుంది. ఇక్కడ మీరు ఈజీ గా అప్లై చేయగల స్ట్రాటజీస్ ని నేర్చుకుంటారు. మీరు అలవాటు చేసుకోవాలనుకునే లేదా విడిచిపెట్టాలనుకునే ఏదైనా అలవాటు కోసం ఈ స్ట్రాటజీలు పనిచేస్తాయి. అలవాట్లు అనేవి ఎలా ఏర్పడతాయి, ప్రతిరోజూ స్థిరంగా వాటిని ఎలా పాటించవచ్చో ఈ పుస్తకం చెబుతుంది. ఇందులోని పాఠాలు మీ జీవితాన్ని మారుస్తాయి.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
- మంచి అలవాట్లను కావాలనుకునే వాళ్ళు
- చెడు అలవాట్లను మానుకోవాలనుకునే వాళ్ళు
- తమను తాము ఇంప్రూవ్ చేసుకోవాలనే వాళ్ళు
రచయిత గురించి:-
జేమ్స్ క్లియర్ ఒక ప్రముఖ రచయిత ఇంకా స్పీకర్. అతని పుస్తకం ఆటామిక్ హ్యాబిట్స్ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. టైమ్ మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్ ఇంకా ఎన్నో అంత్జాతీయ పత్రికల్లో ఆయన ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. జేమ్స్ క్లియర్, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో జరిగిన ఈవెంట్స్ లో మాట్లాడారు. ఇంటెల్, లింక్డ్ఇన్, హోండా మొదలైనవి అతని ఒకప్పటి క్లయింట్లు. అలవాట్లు, నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి రాయడం, మాట్లాడటం చేస్తున్నారు.