ఏ వ్యక్తి అయినా మానవత్వం దానిని సృష్టించిందని ఎలా చెప్పగలడు? ఎవరయినా నాగరికత ఉత్తమమైన స్టేజ్ లో వుంది అని ఎలా చెప్పగలరు? అతను వెనక్కి తిరిగి చూడగలగాలి. మనం ఎంత ముందుకు వెళ్ళామో, ఏం సాధించామో తెలుసుకోవడానికి వెనక్కు తిరిగి చూసుకోవడం కన్నా మించిన మార్గం లేదు. ఈ బుక్ ప్రస్తుతం మానవత్వం ఏ స్థితి లో ఉందో అన్న విషయంలో మనకు జ్ఞానోదయం కలిగిస్తుంది. మనం ముందుకు వెళుతున్నామా లేక దురదష్టవశాత్తూ అక్కడే ఉండిపోయామా?
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
చరిత్రను ఇష్టపడేవారు
భవిష్యత్ గురించి ఆలోచించేవారు
కాలేజ్ స్టూడెంట్స్
యువ ప్రొఫెషనల్స్
రచయిత గురించి:-
యూవల్ నోహ్ హరారీ ఒక రచయిత మరియు ప్రొఫెసర్. ఆయన హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెం లో ప్రపంచ చరిత్రను టీచ్ చేస్తారు. ఆయన రాసిన సేపీఎన్స్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనే బుక్ అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్ అయింది. 10 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి ఇంకా 40 కి పైగా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది.