Why Should You Read This Summary?
మీరు ఈ సారాంశాన్ని ఎందుకు చదవాలి?
మీకు చాలా పనులు ఉన్నాయా ఇంకా మీరు ఏమీ చేయలేక ఫ్రీజ్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారా? అయితే మీకు మేమున్నాం. ఈ మోడర్న్ యుగంలో, మనం హేండిల్ చేయగలిగే దానికంటే చాలా ఎక్కువ చేయడం పట్ల అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది. ఈ పుస్తకం, అవసరం లేని వాటిని ఎలా వదిలేయాలో, మీ జీవితాన్ని ఐదు కేటగిరీల కింద ఎలా ఫోకస్ చేయాలో, అలాగే చక్కగా పని చేసే టైం మేనేజ్మెంట్ రొటీన్‌ను ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పుతుంది. మీకు కావలసిందల్లా ప్రతిరోజూ 18 నిమిషాలు.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
- స్టూడెంట్స్
- పారిశ్రామికవేత్తలు (Entrepreneurs)
- బిజీ షెడ్యూల్ ఉన్న ఎవరైనా
రచయిత గురుంచి:-
పీటర్ బ్రెగ్మాన్ సీనియర్ బిజినెస్ లీడర్స్ కు ఎగ్జిక్యూటివ్ కోచ్. అతను ప్రొఫెషనల్స్ కోసం కోచింగ్ ఇచ్చే సంస్థ అయిన ‘బ్రెగ్మాన్ పార్ట్నర్స’ ఫౌండర్ అలాగే CEO. పీటర్ బ్రెగ్మాన్, CEOలు ఇంకా సీనియర్ మేనేజర్లు వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మ్ చేయడానికి సహాయపడతాడు. అతను 16 బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత కూడా.